22, డిసెంబర్ 2010, బుధవారం

హిందూ విద్వేష వాద కవిత్వం

32 కామెంట్‌లు
  • లష్కరే తోయిబా కంటే హిందూ తీవ్రవాదమే ప్రమాదకరమైనది అని రాహుల్ ’అజ్ఞాని’ గాంధీ వాగితే, అది ఇప్పుడు బైటపడింది.
  • ముంబైపై ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసిన దాడిలో చనిపోయిన కర్కరే హత్య గురించి దిగ్విజయ్ సింగు, అది హిందూ ఉగ్రవాదుల కుట్రే అనే అర్థం వచ్చేలా అన్నాడు. అలా వాగొద్దని కర్కరే భార్య అతడికి వాతలు పెట్టింది.
  • కేంద్ర హోం మంత్రి చిదంబరం కాషాయ ఉగ్రవాదం అంటూ పార్లమెంటులోనే అన్నాడు..
హిందూ ఉగ్రవాదం, కాషాయ తీవ్రవాదం అంటూ మాట్టాడ్డానికి ఎవడూ ఎనకాడ్డు -రాహుల్ గాంధీ దగ్గర్నుండి, రంగు వెలిసిపోయిన రోతకవుల  దాకా ఎవుడైనా సరే, విచ్చలవిడిగా వాగేస్తారు.

26, నవంబర్ 2010, శుక్రవారం

ఉత్సవ విగ్రహాలు, లార్జర్ దాన్ లైఫ్ సైజు కటౌట్లూ!

10 కామెంట్‌లు
ఆంధ్రప్రదేశుకు ముఖ్యమంత్రిని  మార్చారు.  తమలోంచి ఒకణ్ణి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన జనానికి ప్రణబ్బు ముఖర్జీ చెప్పేదాకా తెలీదు, కుర్చీ ఎక్కబోయేది ఎవరో!  ఛానెళ్ళ పుణ్యమా అని, వాళ్లకంటే మనకే కొంత ముందు తెలిసింది.  ’ఏంటి ఎవరు  ముఖ్యమంత్రి కాబోతున్నారు ’అని అడిగితే కాంగీయుడు ప్రతీవాడూ చెప్పిన సమాధానం ఒకటే - అధిష్ఠానం మాటే మామాట ! అమ్మ మాట  బంగారు మూట అనమాట! ఇక్కడి నాయకుణ్ణి విమర్శించమంటే అడ్దమైన బూతులు తిడుతూ ఒంటికాలిమీద లేచేవాళ్ళే వీళ్ళంతా..  కాని మేడమ్మ దగ్గరికి వచ్చేసరికి తోకలు ముడుస్తారు. పిల్లికూనలైపోతారు. ఏంటో ఆ అమ్మ గొప్పదనం!  ఏమిటి ఆమెలో ఉన్న మహత్తు? ఎన్నికల్లో వీళ్ళందరినీ ఒంటిచేత్తో గెలిపించుకు పోగల సమర్ధత, మహిమా ఉన్నాయా? రాష్ట్ర సమస్యలను ఢిల్లీలో కూచ్చుని అవలీలగా తేల్చిపారేస్తదా?

11, అక్టోబర్ 2010, సోమవారం

అయోధ్య తీర్పు న్యాయమైనదే!

36 కామెంట్‌లు
"అయోధ్య తీర్పు న్యాయంగా లేదు, సాక్ష్యాలను బట్టి కాక, నమ్మకాలను బట్టి  ఇచ్చిన తీర్పు" అని విమర్శిస్తున్నారు ఉగ్ర లౌకికవాదులు.

నిజమే, ఇది సాక్ష్యాలను బట్టి ఇచ్చిన  తీర్పు కాదు, నమ్మకాలను బట్టి ఇచ్చిన తీర్పే!  సాక్ష్యాలను బట్టి ఇచ్చిన తీర్పే అయితే, మూడోవంతు కాదు, మొత్తం వివాదాస్పద స్థలమంతా హిందువులకే దక్కి ఉండాల్సింది.  ఎందుకంటే..

2, అక్టోబర్ 2010, శనివారం

సునామీ రావాలని కోరుకోకు!

160 కామెంట్‌లు
ఈమధ్య బ్లాగుల్లో ఒక కొత్త ధోరణి వచ్చింది - మనకు నచ్చని విషయం ఎక్కడైనా కనిపించిందనుకోండి.. వెంటనే మన బ్లాగుకు వెళ్ళిపోయి దాన్ని విమర్శిస్తూ ఒక కవిత రాసిపడెయ్యడమన్నమాట!   ఏదైనా కవితను కాపీకొట్టైనా సరే..  నేనూ ఒక కవిత రాసెయ్యాల్సిందే అనుకున్నాను.  కత్తిలాంటి బ్లాగు, మహేష్ కుమార్ గారి పర్ణశాల అందుబాటులో ఉందిగదా.. అందులోని దళిత తీవ్రవాదం అనే టపాను ఎంచుకున్నాను.

27, సెప్టెంబర్ 2010, సోమవారం

తెలుగు సినిమా పరిశ్రమలో "ఆ నలుగురు" ఎవరు?

7 కామెంట్‌లు
తెలుగు సినిమా దశ దిశ గురించి శనివారం నాడు హెచ్చెమ్ టీవీ ఒక చర్చా కార్యక్రమం చేసింది. అనేకమంది నిర్మాతలు, దర్శకులు ఇతర సాంకేతికులూ ఈ అమావేశంలో పాల్గొని తమ గోడు వెళ్ళబోసుకున్నారు.  పరిశ్రమ గురించి చర్చ పెడితే, పెద్ద నటులెవరూ రాలేదు. పెద్ద నిర్మాతలు, దర్శకులూ కూడా ఎవరూ రాలేదు.  -వాళ్ళను పిలవలేదో, పిలిచినా రాలేదో, వాళ్ళకు లాభం కలిగే సంగతులు ఇక్కడ లేవో, మరింకేంటో!  రామచంద్రమూర్తి  మన ఉద్దేశం ఫాల్ట్ ఫైండింగు కాదు ఫ్యాక్ట్ ఫైండింగ్! అని చెప్పాడు.  పాల్గొన్నవాళ్లలో కొందరు:  ప్రసన్న కుమార్,  సాగర్, విజయచందర్, విజేందర్ రెడ్డి, ఏవీయెస్.

18, సెప్టెంబర్ 2010, శనివారం

వంచన దినం! వంచకుల దినం!!

12 కామెంట్‌లు
ఈయేడు సెప్టెంబరు 17 నాడు ఏం చేసుకోవాలో తెలీలేదు మన రాజకీయ నాయకులకు.  పదిహేను రోజుల ముందుదాకా ఒక్కోడు పెద్దపెద్ద కబుర్లు చెప్పారు. వీర తెవాదులు విమోచనమన్నారు. అంత వీరులుకానివారు విలీనమన్నారు. సరే.., కొందరు మూర్ఖవాదులు విద్రోహమన్నారు - వీళ్ళని పక్కన పెట్టెయ్యొచ్చు ప్రస్తుతానికి.  వీళ్ళంతా ఇట్టా పోసుకోలు కబుర్లు చెబుతూ ఉన్నప్పుడు ముస్లిములు అడ్డు చెప్పలేదు, వాగనిచ్చారు. తరవాత ఒక ఇఫ్తారు పార్టీ పెట్టారు. 

15, సెప్టెంబర్ 2010, బుధవారం

పొద్దులో నేను..

5 కామెంట్‌లు
ఈమధ్య మా స్నేహితుడొకణ్ణి కలిసినపుడు, పొద్దు చూసావా అని అడిగాను.  వాడు నన్నోసారి వింతగా చూసి, ’నేను చూసేసరికి నడినెత్తిన ఉంటది, ఇంకేం చూస్తాను?’ అన్నాడు. అది కా దది కాదు..  పొద్దు, పొద్దు పత్రిక! చదివావా? అని అడిగాను. నన్నొక పిచ్చివాణ్ణి చూసినట్టు చూసాడు. వాడికి ముందే పత్రికలు, పుస్తకాలు, చదవడం లాంటివంటే ఎలర్జీ.  చిన్నప్పుడెప్పుడో చందమామ చదివితే, ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయంట. సైన్సు పుస్తకం చదవబోతే కళ్ళు వాచిపోయినై. అప్పటినుంచీ, పుస్తకాల జోలికి వెళ్ళకుండా జాగర్తగా నెట్టుకొస్తున్నాడు. అలాంటివాణ్ణి పొద్దు చదివావా అని అడిగితే, వాడు నావంక అయోమయంగా చూడ్డూ మరి!

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

పోయినోళ్ళందరూ మంచోళ్ళే..

28 కామెంట్‌లు
పోయినోళ్ళందరూ... మంచోళ్ళు! ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు!!  -ఆత్రేయ చెప్పాడంట.

రాశేరె కూడా పోయాడు. కాబట్టి చాల మంచోడు! 

6, సెప్టెంబర్ 2010, సోమవారం

మబ్బులు చూపించి.. ముంత ఒలకబోయించి..

33 కామెంట్‌లు
కొందరు తెవాదుల అకృత్యాలు ఉండేకొద్దీ వికృత రూపాన్ని తీసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. డిసెంబరు తరవాత ’అలజడి సృష్టించడానికి’ ఇప్పటినుండే రిహార్సళ్ళు చేసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. మొన్న ఉస్మానియాలో తెవాదులు పేపర్లు దిద్దే పంతుళ్ళను వెంటబడి మరీ దాడి చేసి కొట్టారు.  అప్పుడు చేసిన తప్పును కప్పిపుచ్చే అవకాశం గ్రూప్ వన్ పరీక్షల రూపంలో ఇప్పుడు వచ్చింది. వెంటనే అవకాశాన్ని అందుకున్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి, వాళ్ళ మనసులను విషపూరితం చేసే ఏ అవకాశాన్నీ ఈ దుష్ట తెవాదులు ఒదులుకోరు. గ్రూప్ వన్ పరీక్షలు ఆపెయ్యాల్సిందేనంటూ గోల చేసారు.

3, ఆగస్టు 2010, మంగళవారం

తెలుగులో వెతకటం అంత వీజీ కాదు గురూ!

20 కామెంట్‌లు
(ఈ వ్యాసంలో కొన్ని పదాల పక్కన బ్రాకెట్లలో అంకెలు చూపించాను. అవి - ఆగస్టు 2 రాత్రి ఆయాపదాల కోసం గూగిలించినపుడు వచ్చిన ఫలితాల సంఖ్య. మళ్ళీ వెతికితే ఈ ఫలితాలు కొద్దిగా అటూఇటూ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రాసినదంతా గూగుల్లో వెతకడాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినదే. గూగిలించడం అంటే google.com లో వెతకడం.) 

31, జులై 2010, శనివారం

శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ప్రజల అభిప్రాయం

26 కామెంట్‌లు
తెలంగాణ ప్రజలు తమకు తెలంగాణ కావలసిందేనంటూ తమ అభిప్రాయం స్పష్టంగా చెప్పారు. వివిధ వేదికల మీద ఇన్నాళ్ళుగా చెబుతూ వచ్చిందే ఇప్పుడు అది ఓటేసి - ఒట్టేసి - మరీ చెప్పారు.

దాదాపుగా అందరూ ఊహించిన ఫలితమే ఇది. ఎన్నికలు పూర్తిగా తెలంగాణ వాదం ప్రాతిపదికగానే జరిగాయి. ప్రజలు తెలంగాణ కావాలని బలంగా కోరుకుంటున్నారనేది సర్వవిదితం. కాబట్టి, మొత్తమన్ని స్థానాల్లోనూ తెరాస, బీజేపీలే గెలుస్తాయని అనుకున్నదే. అయితే ఈ స్థాయిలో గెలుస్తారని, మెజారిటీలు ఇంత ఎక్కువగా ఉంటాయనీ, మిగతా పార్టీలను ఇలా ఊడ్చవతల పారేస్తారనీ ఊహించలేదు. ఆ విధంగా ఈ ఎన్నికల ఫలితాలు కొంత ఆశ్చర్యం కలిగించేవే!

21, జులై 2010, బుధవారం

నిష్పాక్షికతను కోరే పక్షపాతులు!

29 కామెంట్‌లు
చంద్రబాబు బాబ్లి యాత్ర నేపథ్యంలో, కొందరు మీడియా మీద పడ్డారు.  మీడియా అనవసరంగా చంద్రబాబుకు ప్రాధాన్యతనిచ్చి, ఉపఎన్నికల్లో  తెరాస ఓడేందుకు పని చేస్తోంది - ఇదీ వారి ఆరోపణ. చాలా అసంబద్ధమైన ఆరోపణ అది. అసలీ నాలుగైదు రోజుల్లో బాబ్లి యాత్రకు మించిన ప్రాధాన్యత కలిగిన మరో సంఘటన లేదు, అంతకంటే పెద్ద వార్తా లేదు. అంచేత, సహజంగానే బాబ్లి యాత్ర  మీడియాలో బాగా ఫోకసైంది.  

18, జులై 2010, ఆదివారం

బాబ్లి సమస్య - చంద్రబాబుది ఉత్తమ స్వార్థం, మిగతావాళ్లది నీచ స్వార్థం!

20 కామెంట్‌లు
గోదావరి మీద మహారాష్ట్ర కడుతున్న బాబ్లి ప్రాజెక్టు గురించి తెదేపా గొడవ చేస్తూ సమస్యను రాష్ట్రాన్ని దాటించి మహారాష్ట్రకు, అక్కడినుంచి ఢిల్లీకీ చేర్చింది. ప్రాజెక్టు చూస్తామంటూ బస్సు యాత్ర చేపట్టి అక్కడి ప్రభుత్వం చెరలో పడ్డారు. ప్రాజెక్టు చూడకుండా తిరిగి పొయ్యేది లేదని చెప్పి, చంద్రబాబు సమస్యను చాలా చక్కగా వెలుగులోకి తెచ్చాడు.

6, జులై 2010, మంగళవారం

మాకూ ఉపశమనం కావాలి!

16 కామెంట్‌లు
కేంద్ర మంత్రి శరద్ పవారుకు పనెక్కువైపోయిందంట, కాస్త రిలీఫు కావాలంట. అవును మరి, బీసీసీఐ, ఐసీసీల్లో పనిచెయ్యడం చేత ఇక్కడ మంత్రిగా పని చెయ్యడానికి టైము దొరకడం లేదు, తీరికా దొరకడం లేదు పాపం. అందుగ్గాను, కేంద్రమంత్రిగా పని తగ్గించాలంట.  మంత్రి పదవిని ఈడి బాబు ఈడికి వారసత్వంగా ఇచ్చినట్టు, పన్నులేసుకుని ఈణ్ణి పోషించండని మన నెత్తిన కూచ్చోబెట్టినట్టూ, ఈ పనీ పాటా చెయ్యని సన్నాసికి కంచిగరుడసేవ చేస్తూ పని చేసేందుకు ఇంకోణ్ణి పెట్టుకోవాలంట. ఈడేమో క్రికెట్టు సంఘాల్లో సమావేశాల్లో తలమునకలుగా ఉంటాడు.

20, జూన్ 2010, ఆదివారం

బియ్యెస్సెన్నెల్ బ్రాడ్ బ్యాండు వాడుకరులారా..

26 కామెంట్‌లు
..అనురాగ దేవతలారా!

ఇలా ధర్మవరపు సుబ్రహ్మణ్యం శైలిలో పిలవడానికి కారణమేంటంటే.. కుసింత జాగర్తగా ఈ టపా చదివి ఇందులో చెప్పిన సూచన పాటించాలని. 

10, జూన్ 2010, గురువారం

మందు x మందులు

9 కామెంట్‌లు
రాష్ట్రంలో మందు దుకాణాల పాటలు కోట్లలో పాడారు. ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు పోగేసుకుంది. పాటలు పాడినవాళ్ళలో ఎక్కువమంది రాజకీయులే. ఏదో ఒక కొట్టులో వాటాలేని ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే అతగాడు పాపం మరీ అమాయకుడైనా అయ్యుండాలి, లేదా మరింకేదైనా డబ్బులొచ్చే యవ్వారంలో తలమునకలుగా ఉండి ఉండాలి, లేదా జయప్రకాశ్ నారాయణైనా అయ్యుండాలి!

25, మే 2010, మంగళవారం

ఒక్కడే మహానుభావుడు..

16 కామెంట్‌లు
మహానటుడు ఎస్వీరంగారావు గురించి బాపు రమణలు ఒక స్కెచ్చి రాసారు ఒకప్పుడు. రంగారావు మనస్తత్వాన్ని, అభిరుచులను, అలవాట్లను, నటన తీరునూ విశ్లేషిస్తూ అనేక రంగారావులను ఆవిష్కరిస్తారు -కంగారం’గారావు, ’చతురం’గారావు,.. -ఇలాగ.

4, మే 2010, మంగళవారం

ఐఐఐయో.. ఐఐఐటీ!

2 కామెంట్‌లు
రాష్ట్ర ఐఐఐటీల్లో ప్రభుత్వం సీట్లను తగ్గించేసింది. రెండేళ్ళ కిందట మొదలుపెట్టిన ఈ ఐఐఐటి వ్యవస్థను మొక్కగా ఉండగానే కత్తిరించడం మొదలుపెట్టింది. ఈ కత్తిరింపు, మొక్క ఏపుగా ఎదగడానికని ప్రభుత్వం చెబుతోంది.

26, ఏప్రిల్ 2010, సోమవారం

హై.లో మతకలహాలు ఏనాటివి?

16 కామెంట్‌లు
ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు హైదరాబాదులో మతసామరస్యం వెల్లివిరిసేదంట. ఎప్పుడైతే ’ఆంద్రోళ్ళు’ ఇక్కడికి చేరుకున్నారో.. అప్పుడే ఇక్కడ మతకలహాలు మొదలయ్యాయని చెబుతున్నారు ఘనతవహించిన తె.వాదులు! చరిత్రను చాప కిందకు తోసేసి, అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. నాలుగురోజుల కిందట ఓ టీవీలో ఘనత వహించిన విశ్లేషకుడొకరు, వెంటనే శనివారం నాడు కేసియారూ ఈ అబద్ధాన్ని చెప్పారు. 

5, ఏప్రిల్ 2010, సోమవారం

మే..ధావుల ’వర్గవివక్ష’

21 కామెంట్‌లు
తెలంగాణ వాదులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చి, తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యమని డిమాండుతున్నారు. అంటే వేరు పడతామంటున్నారు. వేర్పాటువాదులన్నమాట! కానీ, ’దాన్ని ప్రత్యేకవాదమని అనాలిగానీ, వేర్పాటువాదమని అనకూడదు’ అని పాత్రికేయుడొకాయన చెబుతున్నారు. ఈ ముక్క గతంలో కొందరు రాజకీయులూ అన్నారు. సమాధానం చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు. బ్లాగుల్లోనూ అన్నారు, అప్పుడూ తగు సమాధానాలే చెప్పారు. కాకపోతే ఇప్పుడు అంటున్నది, మేధావి వర్గానికి చెందిన పాత్రికేయుడు. ఏప్రిల్ 4, ఆదివారం నాడు హెచ్చెమ్ టీవీలో పాల్గొన్న పాత్రికేయులకు 'వేర్పాటువాదం’ అనే మాట తప్పనిపించింది. ఆ మాటను దేశం నుండి విడిపోవాలని కోరితేనే అనాలంట. తెలంగాణ డిమాండును ఆ పేరుతో పిలిస్తే ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల్ని అవమానించినట్టేనంట!! ఈ ముక్కలన్నది ఎ.శ్రీనివాసరావు. 

15, ఫిబ్రవరి 2010, సోమవారం

శ్రీకృష్ణ కమిటీ - సరైన మధ్యవర్తి!

7 కామెంట్‌లు
రెండు పక్షాల వారు తమలో తాము సంప్రదింపులు చేసుకుని ఒక అంగీకారానికి వచ్చే అవకాశం కోల్పోయిన ప్రస్తుత పరిస్థితిలో మూడో పార్టీ రంగ ప్రవేశం చేసి మధ్యవర్తిత్వానికి శ్రీకృష్ణ కమిటీని సిద్ధం చేసింది. ’ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమస్యపై సమాజంలోని వివిధ పార్టీలు, వర్గాలతో విస్తృత స్థాయి చర్చలు జరిపేందుకు గాను’ ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దాని పనులేమేంటో కూడా తేల్చింది. కమిటీ విధుల జాబితా మూడు భాగాలుగా ఉంది..

25, జనవరి 2010, సోమవారం

హెచ్చెమ్ టీవీ వరంగల్లు సమావేశం

4 కామెంట్‌లు
రాష్ట్ర విభజనపై హెచ్చెమ్ టీవీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాల్లో తరువాతిది వరంగల్లులో జనవరి 24, ఆదివారంనాడు జరిగింది. సమావేశం బాగా జరిగింది. కొందరు మాట్టాడుతున్నపుడు గోల జరిగిందిగానీ, పెద్దలు శాంతపరచడంతో వెంటనే సద్దుమణిగింది. మిగతా సమావేశాల్లో లాగానే, ఇక్కడ కూడా సరుకున్న ప్రసంగాలు కొన్నే! ఎక్కువ ప్రసంగాలు బాగా నలిగిన పాత సంగతులే చెప్పగా, కొద్ది మంది చేసిన ప్రసంగాలు ఉత్త ఊకదంపుడే!

23, జనవరి 2010, శనివారం

శాస్త్రీయ పుకారు

8 కామెంట్‌లు
నేను మొదటి ఉద్యోగంలో చేరినపుడు ఇండక్షన్ కార్యక్రమం ఒకటి వారంపాటు జరిగింది. మొత్తం ఒక యాభై మందిమి. ఓరోజున ఓ గదిలో కూలేసి కమ్యూనికేషన్స్ నిపుణుడొకాయన క్లాసు పీకుతున్నాడు. కాసేపయ్యాక, ఒక సరదా ఆట ఆడదామని చెప్పాడు. మొదటి వరసలో కూచ్చున్న మొదటి వాడి దగ్గరికెళ్ళి, 'ఇదుగో ఇతని చెవిలో రహస్యంగా ఒక కబురు చెబుతాను. అతడు తన పక్కవాడి చెవిలో ఆ సంగతిని ఊదుతాడు. ఆతడు తన పక్కవాడి చెవిలో చెబుతాడు. అలా చెప్పుకుంటూ వెళ్ళగా, చిట్టచివరి వాడు తనకు చేరిన సమాచారమేంటో బోర్డు మిద రాస్తాడు.' అని చెప్పి, మొదటివాడి చెవిలో ఏదో కబురు చెప్పాడు. దాన్నీ, చిట్టచివరివాడు బోర్డు మీద రాసేదాన్నీ పోల్చి చూస్తాడన్నమాట, ఇదీ ఆట!

21, జనవరి 2010, గురువారం

2010 జనవరి 18 - తెలంగాణ ఉద్యమంలో కంచె అయిలయ్య రోజు!

24 కామెంట్‌లు
తెలంగాణ ఉద్యమంలో 2010 జనవరి 18 న హఠాత్తుగా కులం ప్రసక్తి తలెత్తింది. ఉద్యమ నేతల కులాలను ఎత్తిచూపి, ఎందుకు వాళ్లకింత ప్రాముఖ్యత, దళిత బహుజనులకు ప్రాముఖ్యత ఎందుకు లేదు అంటూ కంచె అయిలయ్య ప్రశ్నిస్తూంటే చర్చలో పాల్గొన్న ఇతర నాయకులు, విశ్లేషక శేఖరులూ కొండొకచో మాటల కోసం తడుముకోవాల్సి వచ్చింది.

19, జనవరి 2010, మంగళవారం

తెలంగాణపై విజయవాడ చర్చ

14 కామెంట్‌లు
రాష్ట్ర విభజనపై హెచ్చెమ్ టీవీ వాళ్ళు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ జరుపుతున్న సమావేశాల వరసలోని మరో సమావేశం విజయవాడలో జరిగింది. జనవరి 17 ఆదివారం సాయంత్రం నుండి అర్థరాత్రి దాకా జరిగిన ఈ సమావేశంలో  మొత్తమ్మీద ఎక్కువమంది సమైక్యాంధ్రనే బలపరచారు. ఇద్దరు ముగ్గురు మాత్రం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలన్నారు.

13, జనవరి 2010, బుధవారం

ది ఫౌంటెన్ హెడ్ - ఎ కొయ్యగుర్రం రైడ్!

25 కామెంట్‌లు
ఆమధ్య, అదేదో ఇంగ్లీషు పుస్తకాలమ్మే కొట్టుకెళ్ళాం. అక్కడ తెలుగు పుస్తకాలు పెద్దగా దొరకవ్. దాని పేరు క్రాస్‌వర్డు అనుకుంటా.  పిల్లలు వెళ్దామన్నారు గదాని వెళ్ళాం. అక్కడ  అయన్ ర్యాండ్  (ఐన్ ర్యాండ్?) రాసిన పుస్తకాలు చూస్తున్నా. అయన్ ర్యాండ్ అని చనువుగా పేరు రాసాను గదా అని నేను ఆవిడ రాసిన పుస్తకాలన్నీ చదివేసి ఉంటానని అనుకునేరు.  ఒక్కటి కూడా చదవలేదు. కానీ నాకావిడ పేరు బాగా తెలుసు -యండమూరి  మనందరికీ ఆవిణ్ణి బాగా పరిచయం చేసాడు గదా! ఆయన రాసిన  కథ ఒకదానిలో  ఒక పాత్ర మరో పాత్రతో అంటుంది.. 'అయాన్ రాండా.. ఆడి కథలు నేను చాలానే చదివాను, నాకు భలే నచ్చుతాయవి' అని అంటాడు. అవతలోడు పెదాలు కాదుగదా, కనీసం ఒంట్లోని ఒక్క అణువు కూడా కదిలించకుండా 'అయన్ రాండంటే ఆడు కాదు, ఆవిడ ' అని అంటాడు. అలా నాకు అయన్ ర్యాండు పరిచయం!

11, జనవరి 2010, సోమవారం

తెలంగాణ వాదుల మరో పచ్చి అబద్ధం

23 కామెంట్‌లు
అభివృద్ధిలో వెనకబడి పోయామని, మాకు అన్యాయం జరిగిందనీ, జరుగుతోందనీ చెబుతూ ప్రత్యేక రాష్ట్రం ఉంటే తప్ప లాభంలేదని తె.వాదులు డిమాండు చేస్తూ వచ్చారు. తరవాత్తరవాత వీళ్ళ గొంతు కాస్త మారి, 'ఆంద్రోళ్ళు' మమ్మల్ని అణగదొక్కారంటూ రాష్ట్ర విభజన భజన చేసేవారు. ఇప్పుడవన్నీ పక్కకు నెట్టి ఆత్మగౌరవం కోసం తెలంగాణ, స్వపరిపాలన కోసం తెలంగాణ అంటూ కొత్త కారణాలు చెబుతున్నారు. ఈ కారణాల్లో న్యాయం ఉందా లేదా చెప్పండి అంటూ తెలివితక్కువ వాదనలు చేస్తున్నారు. అభివృద్ధి లేదన్న మాట మాత్రం ఇప్పుడు వీళ్ళ నాలుకల మీద కనబడదు.

7, జనవరి 2010, గురువారం

ఢిల్లీ చర్చలు

46 కామెంట్‌లు
జనవరి 5 న జరిగిన చర్చల ద్వారా రెండు వైపుల ఉన్న ఉద్యమకారులూ వేసిన ముందడుగేమీ లేకపోవచ్చు. కేంద్రం మాత్రం విభజనవాదులను, సమైక్యవాదులనూ ఒకచోటికి చేర్చి మాట్టాడగలిగింది. మా అభిప్రాయాలనూ విన్నారు అనే భావనను వాళ్ళలో కలిగించ గలిగింది. ఉద్యమాలను ఆపాలని వాళ్లకు చెప్పి ఆపించగలిగింది. ఏదేమైనా, తెలంగాణ విషయంలో కేంద్రం వెనకడుగేసినట్టేమీ అనిపించలేదు.

2, జనవరి 2010, శనివారం

రాష్ట్ర విభజనపై తిరుపతిలో రౌండ్‌టేబుల్ సమావేశం

10 కామెంట్‌లు
రాష్ట్ర చీలిక ఉద్యమం నేపథ్యంలో హెచ్చెమ్‌టీవీవాళ్ళు వివిధప్రాంతాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతపు సమావేశం ఆమధ్య హై.లో జరిగింది. తరువాత డిసెంబరు 27న రాయలసీమ సమావేశం తిరుపతిలో జరిగింది. సాయంత్రం దాదాపు ఐదున్నర నుండి రాత్రి 11 గంటల దాకా జరిగిన ఈ సమావేశంలో సీమ నాయకులు, మేధావులు తమ ఆలోచనలను, అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.

1, జనవరి 2010, శుక్రవారం

కొత్త సంవత్సరానికి పాత టపాలు!

16 కామెంట్‌లు
నచ్చిన బ్లాగుల గురించి, టపాల గురించీ ఈ మధ్య టపాలొస్తున్నాయి. ఆ స్ఫూర్తితోనే ఈ టపా!

సాధారణంగా నాకు హాస్యం చిప్పిల్లే టపాలు నచ్చుతాయి. అసలు హాస్యం నచ్చందెవరికిలెండి!! హాస్యం తరవాత, జ్ఞాపకాల టపాలు కూడా నాకెంతో నచ్చుతాయి. ఎవరి జ్ఞాపకాలు వాళ్ళకు ముద్దేననుకోండి. నాకు మాత్రం ఎవరి జ్ఞాపకాలైనా ముద్దే! చదవడానికి ఆహ్లాదకరంగా, చదివాక హాయిగా ఉండే ఏ టపాలైనా బావుంటాయి. ఎప్పటికప్పుడు గుర్తుకొస్తూ ఉండే టపాలు కొన్నిటి గురించి ఇక్కడ కొంత...

సంబంధిత టపాలు